logo

కల్వకుంట్ల కుటుంబానికి కటకటాలే

కల్వకుంట్ల కుటుంబం, వారి బంధువులు కటకటాలు లెక్కించక తప్పదని భాజపా రాష్ట్ర కార్యదర్శి అల్దీపూర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Published : 04 Dec 2022 05:39 IST

భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌

తిమ్మాపూర్‌లో ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో శ్రీనివాస్‌

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: కల్వకుంట్ల కుటుంబం, వారి బంధువులు కటకటాలు లెక్కించక తప్పదని భాజపా రాష్ట్ర కార్యదర్శి అల్దీపూర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లో ప్రజాగోస- భాజపా భరోసా కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వీధికో బెల్టుషాపును ఏర్పాటు చేసి పేదలను తాగుబోతులుగా తయారు చేశారని విమర్శించారు. రూ. 14 వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని రూ. 45 వేల కోట్లకు పెంచారని, అదే అలవాటుగా దిల్లీలో కూడా సంపాదిస్తామనే దురాశతో లిక్కర్‌ కుంభకోణంలో ఇరుక్కున్నారని పేర్కొన్నారు. లిక్కర్‌ స్కాంలో ఇరుక్కుపోయిన కవిత నేడు భాజపా, ప్రధాని నరేంద్రమోదీని నిందించడం శోచనీయమన్నారు. తెరాస అధికారం చేపట్టిన 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని రంగాల్లో దివాలా తీసిందని ఆరోపించారు. పట్టణాల్లో లక్ష, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లను మంజూరు చేస్తానమన్న తెరాస ప్రకటన అలాగే మిగిలిపోయిందని తెలిపారు.  రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు కూడగట్టుకునేందుకే ప్రజలను కలుస్తున్నామని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ బాధ్యుడు మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమాకాంత్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, నాయకులు బుగ్గారెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని