logo

నేటి నుంచి ధర్మగుండంలో పుణ్యస్నానాలకు అనుమతి

దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ధర్మగుండాన్ని ఆదివారం పునఃప్రారంభించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated : 04 Dec 2022 06:09 IST

సిద్ధం చేసిన రాజన్న ఆలయ ధర్మగుండం

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ధర్మగుండాన్ని ఆదివారం పునఃప్రారంభించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం కొవిడ్‌ కారణంగా ధర్మగుండాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలు రావడంతో తిరిగి తెరిపించేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల ఇందులో పూడిక తొలగించి శుభ్రం చేసి రంగులు వేశారు. ధర్మగుండంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీటిని నింపి సిద్ధం చేశారు. ధర్మగుండంలో ఆదివారం 8 గంటలకు అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు