పేద కుటుంబం వెన్ను విరిగింది
సొంత ఊళ్లో ఉపాధి లేక ఇరవై ఏళ్ల కిందట భార్యాబిడ్డలతో పెద్దపల్లికి వలస వచ్చాడు.. ఇక్కడే కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
చెట్టుపై నుంచి పడి మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద
సిల్వరాజుకు అన్నం తినిపిస్తున్న కూతురు నవ్యశ్రీ
న్యూస్‌టుడే, పెద్దపల్లి: సొంత ఊళ్లో ఉపాధి లేక ఇరవై ఏళ్ల కిందట భార్యాబిడ్డలతో పెద్దపల్లికి వలస వచ్చాడు.. ఇక్కడే కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నంతలో పిల్లలను చదివిస్తున్నాడు.. ఈ క్రమంలో అనుకోని ప్రమాదం అతడిని మంచానికే పరిమితం చేసింది.. దీంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది.. శస్త్రచికిత్స చేస్తే అతడు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉండగా ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన బత్తుల సిల్వరాజు(42) భార్య రేణుక, ఇద్దరు పిల్లలతో పెద్దపల్లికి వలస వచ్చాడు. పట్టణంలోని శాంతినగర్ కెనాల్ ప్రాంతంలో నివాసముంటూ భార్యాభర్తలు కూలీ పనులకు వెళ్తుండేవారు. పిల్లలిద్దరికీ మంచి చదువు అందించేందుకు ప్రైవేటు కళాశాలలో చేర్పించారు. కొడుకు శివకుమార్ హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగా, కూతురు నవ్యశ్రీ స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ క్రమంలో గత వేసవిలో సిల్వరాజు చింత చెట్టు ఎక్కి కాయలు తెంపే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. వెన్నెముకకు బలమైన దెబ్బలు తగిలి మూడు ప్రాంతాల్లో విరిగిపోయింది. వెన్నెముక పనితీరును నియంత్రించే నరం కూడా తెగిపోవడంతో నడుం నుంచి కింది భాగం చచ్చుబడిపోయింది. ఈ ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రమాదంతో సిల్వరాజు మంచానికే పరిమితమయ్యాడు. పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స అందించడానికి బంధువులు, తెలిసిన వారి సాయంతో పాటు పిల్లల కోసం కూడబెట్టిన సొమ్ము కలిపి రూ.10 లక్షల వరకు వెచ్చించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. తండ్రి ఆలనా, పాలనా చూసుకునేందుకు నవ్యశ్రీ కళాశాల మాని ఇంటి వద్దే ఉంటోంది. శివకుమార్ బీటెక్ ఫీజు చెల్లించాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి తేవడంతో బంధువుల ఆర్థిక సాయంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్యులు సిల్వరాజును పరీక్షించి, వెన్నెముకకు శస్త్రచికిత్స చేస్తే కోలుకుంటాడని చెప్పినట్లు భార్య రేణుక చెప్పింది. ఇందుకు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఓవైపు పిల్లల చదువు, మరోవైపు భర్తకు శస్త్రచికిత్స చేయించేందుకు ఆర్థిక స్థోమత సరిపోక రేణుక ఆవేదన చెందుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Gurugram: ‘నేనేం తప్పు చేశాను.. నాకెందుకు ఈ శిక్ష’... 14 ఏళ్ల బాలికపై దంపతుల పైశాచిక దాడి!
-
Politics News
MLC Kavitha: జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత
-
Sports News
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా
-
General News
CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలివ్వండి.. సీఎస్‌కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ
-
India News
Earthquake: తుర్కియేలో భారతీయులు సేఫ్.. ఒకరు మిస్సింగ్
-
Crime News
Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?