logo

మార్చి 31లోగా సమీకృత మార్కెట్ల నిర్మాణం పూర్తి

కరీంనగర్‌లో నిర్మిస్తున్న నాలుగు సమీకృత మార్కెట్లను మార్చి 31లోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ, సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు.

Published : 05 Dec 2022 05:45 IST

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశం


మంత్రికి పనుల తీరును వివరిస్తున్న మేయర్‌ సునీల్‌రావు

కరీంనగర్‌ కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌లో నిర్మిస్తున్న నాలుగు సమీకృత మార్కెట్లను మార్చి 31లోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ, సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఎదురుగా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ పనులను జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్ల మీద ఉపాధి పొందుతున్న వారి పొట్టకొట్టకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగరంలో పద్మానగర్‌, కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఎదురుగా, కిసాన్‌నగర్‌ బీట్‌ మార్కెట్‌, కశ్మీర్‌గడ్డలో రూ.40 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. వీటిలో 2 వేల మంది అమ్మకందారులకు కూర్చోవచ్చునన్నారు. కళాభారతి కూల్చివేస్తామని, దీనిని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ఆవరణలో ఆడిటోరియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి కరీంనగర్‌ సర్య్కూట్‌ రెస్ట్‌ హౌజ్‌గా నామకరణం చేశామని, ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ప్రారంభించేందుకు వీలుగా ఈనెలలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు.
అనుమతుల్లేకుండా ఇళ్లు నిర్మించుకోవద్దు..: ఓ ప్రశ్నకు మంత్రి గంగుల కమలాకర్‌ సమాధానం ఇస్తూ అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేయకూడదన్నారు. నగర మేయర్‌ వై.సునీల్‌రావు, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్‌, నేతికుంట యాదయ్య, ఐలేందర్‌యాదవ్‌, కుర్ర తిరుపతి, డీఈఈ మసూద్‌అలీ, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని