logo

అనుమానాస్పద స్థితిలో మాజీ ఉద్యోగి మృతి

ఉద్యోగం కోల్పోయి మానసిక వేధనతో బాధపడుతున్న ఓ మాజీ ఉద్యోగి కరీంనగర్‌లోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Published : 05 Dec 2022 05:45 IST

కరీంనగర్‌ నేరవార్తలు: ఉద్యోగం కోల్పోయి మానసిక వేధనతో బాధపడుతున్న ఓ మాజీ ఉద్యోగి కరీంనగర్‌లోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కరీంనగర్‌ ఒకటో ఠాణా ఎస్సై రహీంపాషా తెలిపిన ప్రకారం... సిద్దిపేట జిల్లా అకన్నపేట మండలానికి చెందిన మాలోతు బాలు(50) ఆర్టీసీ కండక్టర్‌ విధుల్లో నిర్లక్ష్యం వహించగా, సంస్థ వారు మూడేళ్ల కిందట ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత అధికారులను కలిసినా విధుల్లోకి తీసుకోలేదు. ఈనెల 2న కరీంనగర్‌లోని ఆర్టీసీ ఆర్‌.ఎం.ను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి కరీంనగర్‌కు వచ్చారు. బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఉన్నారు. 3వ తేదీన అర్ధరాత్రి లాడ్జి సిబ్బంది బాలు ఉన్న గది నుంచి కదలికలు లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా మంచంపై పడి ఉన్నారు. ఒకటో ఠాణా పోలీసులకు సమాచారమివ్వగా వారు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. అక్కడ ఎలాంటి వస్తువులూ లభించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు.


శిక్ష పడుతుందనే భయంతో ఆత్మహత్య

కరీంనగర్‌ నేరవార్తలు: రోడ్డు ప్రమాదం కేసులో శిక్ష పడుతుందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్యానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరీంనగర్‌ రూరల్‌ ఎస్సై ప్రశాంత్‌ తెలిపిన ప్రకారం.. మూడేళ్ల కిందట కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన బెజ్జంకి సంపత్‌(25) వాహనంలో వెళ్తుండగా, వెలుగటూరు మండలం రాజారాంపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. నవంబరు 25న కేసు తీర్పు వెలువడనుండడంతో తనకు శిక్ష పడుతుందని భయపడి నవంబరు 23న కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకొని సంపత్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని