logo

మహిళా రైతు దుర్మరణం

నారుమడి దున్నేందుకు వెళుతున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి కాలువలో పడడంతో మహిళా రైతు దుర్మరణం చెందగా ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 05 Dec 2022 05:45 IST

భర్త, కుమారుడికి తీవ్ర గాయాలు
అదుపు తప్పి కాలువలో పడ్డ ట్రాక్టర్‌

మానకొండూర్‌, న్యూస్‌టుడే: నారుమడి దున్నేందుకు వెళుతున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి కాలువలో పడడంతో మహిళా రైతు దుర్మరణం చెందగా ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన లింగాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తాళ్ల రాజయ్య, లావణ్య (30) దంపతులు తమ పొలం పనులకు సన్నద్ధం అవుతున్నారు. నారు మడి దున్నడానికి ట్రాక్టర్‌కు నాగళ్లను వేసుకొని మహిళా రైతు, భర్త, కుమారుడు వెళుతుండగా తోటకుంటపల్లి శివారులో అదుపు తప్పి ఎస్సారెస్పీ డీబీఎం-4 ఉప కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో లావణ్యపై ట్రాక్టర్‌ పడడంతో అక్కడికక్కడే మరణించింది. భర్త రాజయ్య(40), కుమారుడు లక్ష్మీనరసింహ(05) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఎనిమిదేళ్ల క్రితం మొదటి భార్య అనారోగ్యంతో మరణించగా తిమ్మాపూర్‌కు చెందిన లావణ్యను రాజయ్య వివాహం చేసుకున్నారు. ఆమె కూడా మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సై తిరుపతి, పోలీస్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని ట్రాక్టర్‌ను బయటకు తీశారు.

దారి ఇరుకుగా ఉండడం వల్లే ప్రమాదం

ఎస్సారెస్పీ డీబీఎం-4 ఉప కాలువపై ఉన్న దారి ఇరుకుగా ఉండడం వల్లే ప్రమాదం సంభవించిందని పలువురు వాపోయారు. కాలువకు రెండు వైపుల 21 అడుగుల స్థలం ఉండాల్సి ఉండగా క్రమేపి ఇరుకుగా మారిందన్నారు. మండలంలో ఉన్న కాలువల పరిస్థితి ఇలాగే ఉంది. సంబంధిత అధికారులు కబ్జా అయిన స్థలాలను వెనక్కి తీసుకొని రహదారులను వెడల్పు చేయాలని రైతులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని