ఉత్పత్తిలో ఉరుకులు
అవాంతరాలను అధిగమిస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారం యూరియా ఉత్పత్తిలో పరుగులు తీస్తోంది.
అవాంతరాలను అధిగమిస్తూ వందశాతం యూరియా తయారీ
న్యూస్‌టుడే, ఫెర్టిలైజర్ సిటీ
రామగుండం ఎరువుల కర్మాగారం
అవాంతరాలను అధిగమిస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారం యూరియా ఉత్పత్తిలో పరుగులు తీస్తోంది. నెల రోజుల్లో పూర్తి కావాల్సిన వార్షిక మరమ్మతులకు రెండు నెలల కాలం పట్టినప్పటికీ ప్రస్తుతం వంద శాతం ఉత్పత్తి సామర్థ్యంతో ఉరకలు పెడుతోంది. తద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్టాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లోని రైతుల యూరియా కొరత నివారణలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో విదేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకునే పరిస్థితులను క్రమక్రమంగా తగ్గించే అవకాశాలున్నాయి. యూరియా పక్కదారి పట్టకుండా కేవలం రైతులకు మాత్రమే ఉపయోగపడేలా నీమ్ కోటింగ్‌తో యూరియా అందించడం రామగుండం ఎరువుల కర్మాగారం ప్రత్యేకత.
లక్ష్యానికి చేరువగా..
వార్షిక మరమ్మతులతో పాటు భారీ వర్షాల కారణంగా లోడింగ్ విభాగంలోని రేకులు లేచిపోవడం వంటి కారణాలతో రామగుండం ఎరువుల కర్మాగారంలో దాదాపు రెండున్నర నెలలకు పైగా ఉత్పత్తి నిలిపి వేయాల్సి రాగా మిగతా ఐదున్నర నెలల్లో ఉత్పత్తి ఆశాజనకంగానే సాగుతోంది. గత నెల 26 నుంచి వందశాతం సామర్థ్యంతో యూరియా ఉత్పత్తి సాగుతుంది. ఎలాంటి అంతరాయాలు లేకుండా ఇలానే ఉత్పత్తి కొనసాగితే వార్షిక ఉత్పత్తి లక్ష్యానికి చేరువయ్యే అవకాశముంది. రామగుండం ఎరువుల కర్మాగారం వార్షిక ఉత్పత్తి లక్ష్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబరు వరకు 5,81,290 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగింది. ఇందులో సుమారు రెండున్నర నెలల పాటు వివిధ కారణాలతో ఉత్పత్తి సాగలేదు. ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉత్పత్తిలో ముందుకు సాగుతున్న ఎరువుల కర్మాగారం ఇదే దూకుడుతో పరుగులిడితే ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన నాలుగు నెలల్లో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేసే అవకాశముంది. రామగుండం ఎరువుల కర్మాగారం నెలసరి ఉత్పత్తి లక్ష్యం 99 వేల మెట్రిక్ టన్నుల యూరియా కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో మే, జూన్, ఆగస్టులో నెలకు లక్ష మెట్రిక్ టన్నులకు పైగా యూరియా ఉత్పత్తి జరిగింది. నవంబరు 11 నుంచి యూరియా ఉత్పత్తి ప్రారంభం కాగా 30 వరకు 72,687 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగింది. రోజువారీ ఉత్పత్తి లక్ష్యం 3,850 మెట్రిక్ టన్నులు కాగా నవంబర్ నెలలో సరాసరిగా 3,825 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తితో ముందుకు సాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్‌బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ
-
Crime News
Andhra News: విజయవాడలో విషాదం.. వాటర్ హీటర్ తగిలి తండ్రి, కుమార్తె మృతి