ఆలోచనల మేళా.. ఆవిష్కరణలు భళా!
చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ సైనిక గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఆహుతులను ఆలోచింపజేశాయి.
చొప్పదండి, న్యూస్‌టుడే
చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ సైనిక గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఆహుతులను ఆలోచింపజేశాయి. విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ఈ మేళాలో పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇన్స్పైర్ ప్రదర్శన విభాగంలో 92 మంది, సైన్స్‌ఫెయిర్ విభాగంలో జిల్లా నుంచి 541 మంది ఆవిష్కరణలు ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, సాంకేతిక పరిజ్ఞానం, గణితాంశాలు తదితర ఏడు విభాగాల్లో ప్రదర్శనలు రూపొందించారు. ప్రతి విభాగంలో జూనియర్, సీనియర్ విభాగాల్లో ముగ్గురు చొప్పున 21 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఇన్స్పైర్ విభాగంలో 10 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. అందులో కొన్ని ఆవిష్కరణలతో ‘న్యూస్‌టుడే’ కథనం.
ప్రయోగం: సోలార్‌తో నడిచే ఇసుక వడపోత యంత్రం
పాఠశాల: జడ్పీహెచ్ఎస్, గర్షకుర్తి
విద్యార్థి: మేఘమాల
గైడ్ టీచర్: జగదీశ్వర్‌రెడ్డి
ప్రాధాన్యం : ప్రస్తుతం భవన నిర్మాణాలు ఎక్కువ అవుతున్న తరుణంలో ఇసుకను పట్టడం ఇబ్బందిగా మారుతుంది. కార్మికులు చేతులతో పట్టే విధానం మాత్రమే అమలులో ఉంది. దీనికి సోలార్‌తో నడిచే యంత్రాన్ని రూపొందించారు. దీని సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ ఇసుకను వడపోయొచ్చు. అదనపు ఖర్చు లేకుండా త్వరగా ఇసుకను పట్టుకోవచ్చు.
ప్రయోగం: వాహనాల వేగాన్ని నియంత్రించే చేసే పరికరం
పాఠశాల: జడ్పీహెచ్ఎస్ (బాలికలు) చొప్పదండి
విద్యార్థి: కె.హర్షిత
గైడ్ టీచర్: మహేశ్
ప్రాధాన్యం : వాహనాలు అతివేగంగా నడపడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు ప్రధాన రహదారుల్లో సెన్సార్లను అమర్చడంతో వాహనాల వేగానికి కల్లెం వేయొచ్చు. వాహనాల ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడొచ్చు.
ప్రయోగం: పర్యావరణహిత వాహనాల తయారీ
పాఠశాల: జడ్పీహెచ్ఎస్, నవాబుపేట
విద్యార్థి: జి.శశాంక్
గైడ్ టీచర్: చంద్రశేఖర్
ప్రాధాన్యం : సహజవనరులైన పెట్రోల్, డీజిల్ అంతరించి పోతున్నందున సోలార్ శక్తితో వాహనాలు నడిచేలా రూపొందించారు. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా నడిచేలా డిజైన్ చేశారు. సోలార్ విద్యుత్తు అయిపోతే దాన్ని తక్షణమే రీఛార్జ్ చేసేలా ఒక పరికరాన్ని రూపొందించారు.
ప్రయోగం: భూగర్భజలాలు పెంపొందించడం
పాఠశాల: రుక్మాపూర్ సైనిక గురుకుల పాఠశాల
విద్యార్థి: శివరామరాజు
గైడ్ టీచర్: గౌతమి కృష్ణకుమారి
ప్రాధాన్యం : ప్రస్తుతం నగరాల్లో రహదారులపై వర్షం నీరు వృథాగా మురుగునీటి కాలువల్లోకి వెళ్లకుండా ప్రతి పది కిలోమీటర్‌కు ఒక ఇంకుడుగుంత ఏర్పాటు చేసి.. భూగర్భజలాలను పెంచేలా ప్రయోగం చేశారు. భవిష్యత్తులో నీటి కష్టాలు రాకుండా, నిల్వ చేయడంతోపాటు తరచూ శుద్ధి చేసి అవసరాలకు వాడుకునేలా ఏర్పాటు చేశారు.
ప్రయోగం: ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ పరికరాలు
పాఠశాల: జడ్పీహెచ్ఎస్ కురిక్యాల
విద్యార్థి: మూల అక్షయ
గైడ్ టీచర్: హరికృష్ణ
ప్రాధాన్యం : ప్లాస్టిక్‌తో పర్యావరణం కలుషితమవుతోంది. ఇలా కాకుండా ఉండేలా కార్న్‌పౌడర్, గ్లిసరిన్, వెనిగర్, అగర్ అగర్‌లతో కలిపి వేడి చేయడంతో బయోడీగ్రేడబుల్(మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్) తయారు చేశారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వీటిని వాడుకోవచ్చు.
ప్రయోగం: వృథా వినియోగంలోకి వృథా నీరు
విద్యార్థి: శ్రీజన్రెడ్డి
గైడ్ టీచర్: మాధురి
ప్రాధాన్యం : వృథాగా ఉన్న నీటిని పరిశుభ్రంగా మార్చేలా ప్రయోగం నిర్వహించారు. మురుగునీటిని సైతం కేవలం రూ.3ల ఖర్చుతో 75 లీటర్లను శుద్ధి చేసేలా ప్రయోగాన్ని రూపొందించారు. సహజంగా దొరికే కంకర, బొగ్గు, ఇసుక తదితర వస్తువులతోనే ఈ నీటి శుద్ధి ప్రకియ చేసేలా డిజైన్ చేశారు.
రాష్ట్ర స్థాయి విజేతలు వీరే..
ఇన్స్పైర్ విభాగంలో బి.మేఘమాల, శివరామరాజు, సాహిత్య, వజ్ర, అభిరామ్ నిహల్, షేజ రిఫత్, వర్షిత, శ్రీజరెడ్డి, అక్షయ, భవానీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సైన్స్ ఫెయిర్‌లో సీనియర్, జూనియర్ విభాగాల్లో ఏడు అంశాల్లో పలువురిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
* సాంకేతిక, సమాచార నైపుణ్యం : కె.హర్షిత, కె.ధీరజ్, ఆర్.అక్షయ, కె.రితికేష్, ఎన్. అమిత్, కె.శ్రీనాథ్.
* ప్రకృతి అనుకూల వస్తువులు : హరిణి, జి.సహస్ర, అయేషా, శ్రీజన్రెడ్డి, కె.శ్రీనాథ్, హరిశేఖర్.
* ఆరోగ్యం, పరిశుభ్రత : ఎం.సాయివినిల్, బి.గ్రీష్మ, వి.సాయివర్షిత్, ఎం.మాన్వితరెడ్డి, హర్షవర్ధన్, ఎం.రితిక.
* రవాణా సృజనాత్మకత: జి.శశాంక్, అయిజ, వికిత, మనోజ్‌కుమార్, విక్షిత్కుమార్, హర్షవర్ధన్.
* పర్యావరణ హితం : డి.శ్రీహస్, శుభశ్రీ సాహు, పి.మేఘన, జి.సౌమ్య, త్రివేణి, లిబా ఫాతిమా.
* చరిత్రపరమైన అభివృద్ధి : నవ్య, అరవింద్, శ్రీనిధి, శ్రీవర్షిణి, మెహ్రిన్, సమీక్ష.
* గణితం : సాయి శ్రీనిక, సాత్విక్, శ్రీకాంత్, నిఖిత, సలావుద్దిన్ పాషా, త్రిష.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Diabetes: ‘డి’ విటమిన్‌తో మధుమేహం నుంచి రక్షణ!
-
Technology News
Whatsapp: వాట్సప్.. ఇక చిటికెలో ఫాంట్‌ను మార్చుకోవచ్చు!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
-
Ap-top-news News
AP Constable Exam: అభ్యర్థుల గోడు వినండి.. మొదటి కీలో ఒకలా.. తుది కీలో మరోలా!
-
India News
ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ప్రభావాలు: ప్రముఖ హృద్రోగ నిపుణుడి వ్యాఖ్యలు