logo

రైతు సమస్యలపై కాంగ్రెస్‌ ధర్నా

తెలంగాణలో 30 లక్షల మంది రైతుల ప్రధాన సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు.

Published : 06 Dec 2022 03:18 IST

మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో 30 లక్షల మంది రైతుల ప్రధాన సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పాల్గొని మాట్లాడారు. ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రుణమాఫీ కాక అదనపు వడ్డీ భారంతో అవస్థలు పడుతున్నారన్నారు. వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, ప్రాజెక్టులతో ముంపునకు గురవుతున్న ప్రాంతాల భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని, చెక్‌డ్యాముల నిర్మాణాలతో సాగు భూములు కోతలకు గురైన వాటికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వివాదాస్పద భూముల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులందరికీ హక్కు పత్రాలు అందజేయాలన్నారు. కేసీఆర్‌, నరేంద్ర మోదీల మధ్య ఉన్న రహస్య ఒప్పందాలను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ, జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేడిపల్లి సత్యం, జిల్లా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, జిల్లా కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి రోహిత్‌రావు పాల్గొన్నారు. ధర్నాకు ముందు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని