logo

ఉన్నత ఆలోచనలే ఉత్తమ ప్రదర్శనకు దోహదం

ఉన్నతంగా ఆలోచిస్తేనే జీవితంలో ఉత్తమ ప్రదర్శనకు దోహదమవుతాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు.

Published : 06 Dec 2022 03:18 IST

విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న ఎమ్మెల్యే, అధికారులు

చొప్పదండి, న్యూస్‌టుడే: ఉన్నతంగా ఆలోచిస్తేనే జీవితంలో ఉత్తమ ప్రదర్శనకు దోహదమవుతాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. మండలంలోని రుక్మాపూర్‌ సైనిక పాఠశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న సైన్స్‌ ఫెయిర్‌ ముగింపోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ చిన్నారులు సైతం నూతన ఆవిష్కరణలు చేస్తూ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు పాలనాధికారులు గరిమ అగ్రవాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు శ్రమ, పట్టుదలను ఆయుధంగా మార్చుకుంటే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని అన్నారు. అనంతరం అత్యుత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులతోపాటు ప్రశంసపత్రాలను అందజేశారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, జడ్పీటీసీ సభ్యురాలు సౌజన్య, ప్రధానాచార్యులు రామకృష్ణ, లచ్చయ్య, జిల్లా సైన్స్‌ అధికారి జైపాల్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి స్వదేశ్‌కుమార్‌, తహసీల్దార్‌ రజిత, ఎంపీడీవో స్వరూప, ఎంఈవో వేణుకుమార్‌ పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు