logo

రామ‘కోటి’కి మోక్షమెప్పుడో!

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చేపట్టే పనులు ఏళ్లు గడిచినా పూర్తికావంటే అతిశయోక్తికాదు.

Published : 06 Dec 2022 03:18 IST

ఏడాదిన్నర దాటినా పూర్తికాని స్తూపం నిర్మాణం

కొండగట్టు అంజన్న ఆలయానికి ఉత్తర ద్వారం ముందువైపు నిర్మించిన స్తూపం  

మల్యాల, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చేపట్టే పనులు ఏళ్లు గడిచినా పూర్తికావంటే అతిశయోక్తికాదు. భక్తుల సౌకర్యం చేపట్టే కొన్ని పనులు అర్ధంతరంగా నిలిచిపోతే, మరికొన్ని పనులు పూర్తయినా వినియోగించుకోకుండా ఏళ్లతరబడి నిర్లక్ష్యంగా వదిలేయడం ఇక్కడ పరిపాటే. అంజన్న ఆలయానికి ఉత్తర ద్వారం ముందు భాగంలో దాదాపు రూ.కోటితో రామకోటి స్తూపం నిర్మించడానికి గత సంవత్సరం మే 8న ఎమ్మెల్సీ కవిత, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 80 రోజుల్లో పూర్తి చేయాలని నాయకులు అధికారులకు సూచించగా నేటికీ పూర్తికాకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా రామకోటి పుస్తకాలు రాసే భక్తులు, హనుమాన్‌ దీక్షాపరులు సదరు పుస్తకాలను రామకోటి స్తూపం అడుగు భాగానికి జారవిడువడానికి ద్వారం ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర క్రితమే భక్తులు రాసిన రామకోటి ప్రతులను సేకరించి ఆలయంలో భద్రపర్చారు. అయినప్పటికీ స్తూపం నిర్మాణం పూర్తికాలేదు. మరో నాలుగు నెలల్లో హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలకు ముందే రామకోటి స్తూపాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి భక్తులకు అందుబాటులో తేవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని