logo

ధర్మగుండంలో స్నానాలు... కోడె మొక్కులు

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి సోమవారం భక్తులు పోటెత్తారు.

Published : 06 Dec 2022 03:18 IST

రాజన్నను దర్శించుకున్న 40 వేలకు పైగా భక్తులు

ఆలయ ప్రాంగణంలో భక్తజనం

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి సోమవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, పరిసరాలు, ప్రసాదాల విక్రయ కేంద్రాలు, ధర్మగుండం భక్తులతో కిక్కిరిసిపోయాయి. పార్కింగ్‌ స్థలం, వీఐపీ రోడ్డు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు తామెత్తు బెల్లం (బంగారం) సమర్పించారు. వివిధ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పరివార దేవతలను దర్శించుకొని తరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేశారు. దాదాపు 40 వేల మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని