logo

నకిలీ బీమా పత్రాలు సృష్టించిన నిందితుల రిమాండ్‌

వాహనాలకు నకిలీ బీమా పత్రాలు సృష్టించిన ఇద్దరు నిందితులను సుల్తానాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ ఇంద్రసేనారెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు.

Published : 06 Dec 2022 03:18 IST

నిందితుల అరెస్టు చూపుతున్న సీఐ ఇంద్రసేనారెడ్డి

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: వాహనాలకు నకిలీ బీమా పత్రాలు సృష్టించిన ఇద్దరు నిందితులను సుల్తానాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ ఇంద్రసేనారెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. సుల్తానాబాద్‌ మండలం కనుకుల వద్ద 2018లో జరిగిన రహదారి ప్రమాద విషయంలో బీమా పరిహారం కోసం కోహెడ మండలం వరికోలుకు చెందిన వేము ఆశిష్‌ తన టాటా ఏసీఈ మ్యాజిక్‌కు చెందిన బీమా పత్రాలను కంపెనీకి సమర్పించారు. ఆ బీమాపత్రాలు నకిలీవని నిర్ధారించుకున్న కంపెనీ ప్రతినిధులు నెల క్రితం సుల్తానాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓదెల మండలం శానగొండకు చెందిన గాజుల లక్ష్మణ్‌ అనే ఆటోడ్రైవర్‌, ఆయనకు పరిచయం ఉన్న వరంగల్‌కు చెందిన మహ్మద్‌ షఫీ అనే ఆటో మెకానిక్‌తో కలిసి నకిలీ బీమా పత్రాలు సృష్టిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. బీమా కావాల్సిన వాహనదారుల నుంచి నిందితులు రూ.5 వేల వరకు వసూలు చేసి నకిలీ బీమా పత్రాలు సృష్టించి అందించేవారు. సోమవారం నిందితులిద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. కేసును ఛేదించిన ఎస్సై ఉపేందర్‌రావు, సిబ్బంది విష్ణువర్ధన్‌, తిరుపతి, రమేశ్‌ను సీఐ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని