అనుమానంతో భార్యను చంపిన భర్త
అనుమానం పెనుభూతమై కట్టుకున్నవాడే భార్య గొంతు నులిమి, రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు.
మెట్పల్లి, న్యూస్టుడే: అనుమానం పెనుభూతమై కట్టుకున్నవాడే భార్య గొంతు నులిమి, రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన మెట్పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ లక్ష్మినారాయణ కథనం మేరకు.. మెట్పల్లి పట్టణం గాజులపేటకు చెందిన షకీల్బేగ్(35), షకీరా బేగం(32)కు 2008లో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు జన్మించారు. సజావుగా సాగిన కాపురం భార్య చరవాణిలో తరచూ మాట్లాడడంతో భర్తకు అనుమానం పెరిగి గొడవలు మొదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని బంధువుల వద్ద పలుమార్లు పంచాయితీలు జరగగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. కొంతకాలం సజావుగానే ఉన్నా ఇటీవల చరవాణి విషయంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. చరవాణిలో మాట్లాడవద్దని చెప్పినా వినకపోవడంతో భార్యను చంపాలని నిర్ణయించుకుని రెండురోజుల కిందట పిల్లలను బంధువుల ఇంటికి పంపాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తలు తీవ్రంగా గొడవపడగా భార్య గొంతు నులిమి, రాయితో తలపై కొట్టి చంపాడు. ఉదయం షకీల్బేగ్ అనుమానాస్పదంగా ఇంట్లోంచి వెళ్తుండడాన్ని గుర్తించిన యజమాని ఇంట్లోకి వెళ్లి చూడగా షకీరాబేగం మృతిచెంది ఉంది. విషయాన్ని వెంటనే బంధువులు, పోలీసులకు తెలిపారు. సీఐ లక్ష్మినారాయణ, ఎస్సై సదాకర్ సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పంపించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: టామ్ అండ్ జెర్రీల అదితి- దుల్కర్.. హెబ్బా పటేల్ లెహంగా అదుర్స్!
-
World News
Earthquake: శిథిలాల కింద తమ్ముడికి ఏం కాకూడదని.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఏడేళ్ల బాలిక ఫొటో
-
General News
Amaravati: విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారు: తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్
-
India News
Subramanian Swamy: అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వేలం వేయాలి..!
-
Sports News
IND vs AUS: తొలి టెస్టు కోసం దినేశ్ కార్తిక్ ప్లేయింగ్ XI ఇదే!.. గిల్, కుల్దీప్కు దక్కని చోటు