logo

వైద్య కళాశాలలో ఉద్రిక్తత

వైద్యకళాశాలలో ఓ గది విషయమై బుధవారం అర్ధరాత్రి ఇద్దరు వైద్యులు వైస్‌ ప్రిన్సిపల్‌కు వాగ్వాదం చోటుచేసుకుంది.

Published : 19 Jan 2023 05:16 IST

పోలీసులతో  మాట్లాడుతున్న వైస్‌ ప్రిన్సిపల్‌ డేవిడ్‌ ఆనంద్‌ కుమార్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: వైద్యకళాశాలలో ఓ గది విషయమై బుధవారం అర్ధరాత్రి ఇద్దరు వైద్యులు వైస్‌ ప్రిన్సిపల్‌కు వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులు చేరుకోవడంతో సదరు వైద్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసిన పోలీసులు కళాశాలకు చేరుకున్నారు. గది కేటాయింపు విషయమై ఓ వైద్యుడు నాలుగు నెలలుగా వేధిస్తున్నారని, ప్రస్తుతం ఆయనతో పాటు మరో వైద్యుడు వచ్చి అకారణంగా కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించారని వైస్‌ ప్రిన్సిపల్‌ డేవిడ్‌ ఆనంద్‌ కుమార్‌ పోలీసులకు వివరించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని అర్ధరాత్రి ఆందోళన వద్దని పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న ఎస్సై చిరంజీవి సర్దిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని