జోగాపూర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
చందుర్తి మండలం జోగాపూర్‌లో శనివారం రాత్రి ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్లపెల్లి శంకర్(52)ను గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమీపంలో కల్లు గీతకు వాడే కమ్మకత్తితో నరికి చంపివేశారు.
శంకర్
రుద్రంగి, న్యూస్‌టుడే: చందుర్తి మండలం జోగాపూర్‌లో శనివారం రాత్రి ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్లపెల్లి శంకర్(52)ను గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమీపంలో కల్లు గీతకు వాడే కమ్మకత్తితో నరికి చంపివేశారు. అయితే గత ఏడాది డిసెంబర్ 27న జోగాపూర్‌లో ఓ మహిళ హత్య గురైంది. హత్యకు గురైన మహిళకు శంకర్‌కు మధ్య భూ వివాదం నేపథ్యంలోనే తాజా హత్య జరిగి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. శనివారం జోగాపూర్‌లో వారసంత జరుగుతుండగా హత్య జరిగినట్లు తెలుస్తోంది. హత్య స్థలాన్ని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ సందర్శించారు. హత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. శంకర్‌కు ఇద్దరు భార్యలు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు 1996లో జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. 2018లో జోగాపూర్‌లో ప్రజాప్రతినిధిపై హత్యాయత్నం కేసులో నిందితుడు కాగా ఇతనిపై చందుర్తి పీఎస్‌లో రౌడీషీట్ ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!