logo

బాలికా.. భయం వీడాలిక!

ఆడపిల్లలు భయంతో కాకుండా పరిణతి చెందిన మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జిల్లా జడ్జి ప్రతిమ అన్నారు.

Published : 25 Jan 2023 04:32 IST

తాహేరు కొండాపూర్‌ సర్పంచి మమతను సన్మానిస్తున్న జిల్లా జడ్జి ప్రతిమ, కలెక్టర్‌ కర్ణన్‌

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఆడపిల్లలు భయంతో కాకుండా పరిణతి చెందిన మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జిల్లా జడ్జి ప్రతిమ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ బాలికా, శిశు దినోత్సవం కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాధారణ, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెళ్లై ఇద్దరు పిల్లల తరువాత, లా పూర్తి చేసి ఈ స్థానానికి చేరుకున్నానని తెలిపారు. కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ మాట్లాడుతూ.. ఆడపిల్లలు, మగ పిల్లలు ఇద్దరు సమానే అనే సందేశాన్ని ఆశా, అంగన్‌వాడీ సిబ్బందితోపాటు అందరూ వారి బాధ్యతగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మహిళలతో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి సుజయ్‌, పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ, అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, బాలల హక్కుల కమిషన్‌ రాష్ట్ర సభ్యురాలు శోభారాణి, బాలల హక్కుల కమిటీ జిల్లా ఛైర్‌పర్సన్‌ ధనలక్ష్మీ, జిల్లా వైద్యాధికారి జువేరియా, జిల్లా సంక్షేమాధికారి సబితా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహేరు కొండాపూర్‌ సర్పంచి మమత, తదితరులను సన్మానించారు.
గంగాధర : మండలంలోని గర్షకుర్తి సర్పంచి అలువాల నాగలక్ష్మిని జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌ సత్కరించి ప్రశంసాపత్రం అందించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేస్తున్న అభివృద్ధి పనులకు జిల్లా అధికారుల నుంచి పురస్కారం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని