logo

ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. మంగళవారం వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లిలో వేములవాడ మండలంలోని కాంగ్రెస్‌ పార్టీ గ్రామశాఖల అధ్యక్షులు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Published : 01 Feb 2023 04:53 IST

సమావేశంలో ప్రసంగిస్తున్న డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌

వేములవాడ, న్యూస్‌టుడే: ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. మంగళవారం వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లిలో వేములవాడ మండలంలోని కాంగ్రెస్‌ పార్టీ గ్రామశాఖల అధ్యక్షులు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులే కీలక పాత్ర పోషించాలన్నారు. ముంపు గ్రామాల సమస్య పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పేదలకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాన్ని చూపిస్తే తాము ఓట్లు అడగమని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు లేని ఊరును మేము చూపిస్తే ఓట్లు అడగొద్దని భారాస నాయకులకు సవాల్‌ విసిరారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో, డీజిల్‌, గ్యాస్‌, వంట నూనెల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం వేశాయని విమర్శించారు. రానున్న రోజుల్లో భాజపా, భారాసలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కనుకయ్య, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌, సర్పంచి ప్రదీప్‌, పర్షరాములు, రమేశ్‌, ఆగయ్య, ప్రభాకర్‌రెడ్డి, మల్లేశం, కనుకయ్య, చంద్రయ్య, శ్రీనివాస్‌, రాయమల్లు, నరేందర్‌, రాజు, సింగరయ్య, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని