logo

మాస్టర్‌ ప్లాన్‌ రద్దు కోరుతూ ఏకగ్రీవ తీర్మానం

జగిత్యాల అర్బన్‌ మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం అధ్యక్షురాలు ములాసపు లక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది.

Published : 01 Feb 2023 04:53 IST

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: జగిత్యాల అర్బన్‌ మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం అధ్యక్షురాలు ములాసపు లక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత హాజరు కాగా.. ఈ సందర్భంగా సభ్యులు మాస్టర్‌ ప్లాన్‌లో సమీప గ్రామాలను కలపటంపై సభ్యులు ఆందోళన చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. అంతకుముందు సర్పంచుల ప్రమేయం లేకుండా డీఎల్‌పీవో, డీపీవో మాస్లర్‌ ప్లానుకు అనుకూలంగా ఎలా తీర్మానం పంపుతారని సభ్యులు మండిపడ్డారు. అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్తు సరఫరా సమయపాలన లేకుండా సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీడీ ఛార్జీలను తొలగించాలన్నారు. సభ్యులు అడిగిన సమాధానాలకు అధికారులు సమాధానం చెప్పారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేస్తారని ఎలాంటి ఆందోళన వద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని వివరించారు. జడ్పీటీసీ సభ్యుడు మహేశ్‌, ఎంపీడీవో స్వరూపరాణి, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సంఘ నిధులకు ప్రణాళికలు తయారు చేయాలి

జగిత్యాల గ్రామీణం: 2023-24 సంవత్సరానికి 15 ఆర్థిక సంఘ నిధులతో జిల్లా పంచాయతీ అభివృద్ధిపై ప్రణాళిక తయారు చేయాలని జగిత్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఆర్థిక సంఘ నిధులను ప్రజలకు సక్రమంగా ఉపయోగపడేలా పనులను రూపొందించేందుకు ఆమె మాట్లాడారు. జడ్పీ సీఈవో రామానుజాచార్యులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని