logo

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటు తరహా విద్య

గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటు తరహా విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత అన్నారు.

Published : 02 Feb 2023 06:01 IST

చిన్నారులతో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, అదనపు కలెక్టర్‌ మకరందు

రాయికల్‌, న్యూస్‌టుడే: గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటు తరహా విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత అన్నారు. రాయికల్‌ మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.18 లక్షల నిధులతో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో తొలి విడతలో 75 పాఠశాలలకు మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. కుమ్మరిపల్లి పాఠశాలలో నాగమల్ల శ్రీనివాస్‌ రూ.60 వేలతో నిర్మించిన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రామాజిపేటలో మడలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూటపల్లి, ఆలూరు, అయోధ్య గ్రామాల్లో పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. అదనపు కలెక్టర్‌ మకరందు, ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, జడ్పీటీసీ అశ్విని, సర్పంచి స్వప్న, ఎంపీటీసీ నాగరాజు, ఆర్డీఏ సభ్యుడు సుధాకర్‌రావు, యాజమాన్య కమిటీ అధ్యక్షుడు రాజేందర్‌, డీఈవో జగన్మోహన్‌రెడ్డి, తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని