జిల్లా కలెక్టర్‌గా యాస్మిన్‌బాషా
జిల్లా కలెక్టర్‌గా షేక్ యాస్మిన్‌బాషా నియమితులయ్యారు. వనపర్తి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను మంగళవారం కుమురంభీం జిల్లాకు బదిలీ చేశారు
బాధ్యతలు చేపడుతున్న యాస్మిన్‌బాషా
జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్‌గా షేక్ యాస్మిన్‌బాషా నియమితులయ్యారు. వనపర్తి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను మంగళవారం కుమురంభీం జిల్లాకు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ జి.రవిని మహబూబ్‌నగర్‌కు బదిలీ చేసి కరీంనగర్ కలెక్టర్‌కు జగిత్యాల ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. బుధవారం ఉదయం జగిత్యాల కలెక్టర్‌గా యాస్మిన్‌బాషాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో సాయంత్రం ఆమె బాధ్యతలు చేపట్టారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంద మకరందు, జగిత్యాల ఆర్డీవో ఆర్.డి.మాధురి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగార్జున, జిల్లాస్థాయి అధికారులు, జిల్లాలోని తహసీల్దార్లు శుభాకాంక్షలు తెలిపారు. 2010లో గ్రూప్-1 ద్వారా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై నారాయణపేట ఆర్డీవోగా, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. 2015లో ఐఏఎస్‌గా పదోన్నతి లభించగా రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పనిచేశారు. కలెక్టర్‌గా పదోన్నతి పొంది మూడేళ్లుగా వనవర్తి జిల్లాలో పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పనిచేసిన అనుభవం ఉండటంతో జగిత్యాల జిల్లాపై అవగాహన ఉందని జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాల అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని కలెక్టర్ యాస్మిన్‌బాషా అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని