ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ
టీఎస్ ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థను కొనసాగిస్తూనే ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు పలు చర్యలు తీసుకుంటుంది.
కరీంనగర్ రవాణా విభాగం, న్యూస్‌టుడే: టీఎస్ ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థను కొనసాగిస్తూనే ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు పలు చర్యలు తీసుకుంటుంది. తాజాగా ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే వారికి ప్రత్యేక రాయితీ ప్రకటించింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 30 రోజులు ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఆర్టీసీలో ఉంది. సంక్రాంతి నుంచి దీనిని 60 రోజులకు పెంచారు. ఆ విధానాన్ని అలానే కొనసాగిస్తున్నారు. ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్‌ఎస్) సాఫ్ట్‌వేర్‌లో ఈ మేరకు మార్పులు చేసింది. 31 నుంచి 45 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే టికెట్‌లో ఐదు శాతం, 41 నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకునే వారికి పది శాతం రాయితీ ఇవ్వనున్నారు. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సుల్లో ఇది వర్తించనుండగా.. www.tsrtconline.in లో టికెట్ బుక్ చేసుకునే వీలుంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
- ఖుస్రోషాఖాన్, ఆర్‌ఎం, కరీంనగర్ రీజియన్
టికెట్‌పై రాయితీని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సాధ్యమవుతుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని