logo

బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు

  కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారని భారాస జిల్లా అధ్యక్షుడు రామకృష్ణా రావు అన్నారు. బుధవారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ కార్పొరేట్‌ అధిపతులకు ఉపయోగపడేలా బడ్జెట్‌ నిలిచిందని.. రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజీని ప్రకటించలేదని వివరించారు.  

Published : 02 Feb 2023 06:09 IST

తెలంగాణకు మొండి చేయి

రాంపూర్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే:   కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారని భారాస జిల్లా అధ్యక్షుడు రామకృష్ణా రావు అన్నారు. బుధవారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ కార్పొరేట్‌ అధిపతులకు ఉపయోగపడేలా బడ్జెట్‌ నిలిచిందని.. రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజీని ప్రకటించలేదని వివరించారు.  

నిరాశ పర్చిన బడ్జెట్‌

సుభాష్‌నగర్‌: కేంద్ర బడ్జెట్‌ జిల్లా ప్రజలను నిరాశ పర్చిందని డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. మెడికల్‌ కళాశాల, చిన్న తరహా పరిశ్రమల మంజూరు, అనుబంధ సైనిక్‌ స్కూల్‌ను పూర్తిస్థాయిలో మారుస్తారని భావించినా మొండిచెయ్యి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు ఐఐటీ కళాశాల తీసుకురావడంలో భాజపా, భారాస ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు.  

అన్ని ర్గాలకు ఊరట

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌): కేంద్ర బడ్జెట్‌ చరిత్రాత్మకమని, అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని భాజపా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నా దూరదృష్టితో సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించారని తెలిపారు. కర్షకుల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు తెచ్చారన్నారు.

ఉపకార వేతనాల రద్దు హేయం  

సుభాష్‌నగర్‌: కేంద్ర ప్రభుత్వం మైనార్టీ బాలబాలికలకు అందించే ఉపకార వేతనాలు రద్దు చేయడం హేయమైన చర్య అని ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్‌ గులాం అహ్మద్‌ హుస్సేన్‌ అన్నారు. బడ్జెట్‌లో మైనార్టీ విద్య, మదర్సాలకు కేటాయింపులు భారీగా తగ్గించారని, రూ.160 కోట్ల నుంచి రూ.10 కోట్లకు కుదించి మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని