పరిమితి పెంచినా.. ప్రయోజనం అంతంతే..!
ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఎదురుచూస్తున్న బొగ్గుగని కార్మికులకు నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితిని పెంచినా తమకు పెద్దగా ప్రయోజనం చేకూరే విధంగా లేదని గని కార్మికులు అంటున్నారు.
న్యూస్‌టుడే, గోదావరిఖని
ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఎదురుచూస్తున్న బొగ్గుగని కార్మికులకు నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితిని పెంచినా తమకు పెద్దగా ప్రయోజనం చేకూరే విధంగా లేదని గని కార్మికులు అంటున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి పరిమితిని పెంచినట్లు ప్రకటించినా పన్ను స్లాబుల విషయంలో మార్పు చేసింది. గతంలో రూ.5 లక్షల వరకు పరిమితిని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ.7 లక్షలకు పెంచింది.
సింగరేణిలో దాదాపుగా రూ.10 లక్షల ఆదాయం ఉన్న కార్మికులే ఎక్కువగా ఉంటారు. వీరికి తప్పనిసరిగా 10 శాతం పన్ను భారం పడనుంది. రూ.7 లక్షల ఆదాయ పరిమితి పెంచినా కొత్త రకం స్లాబులు రూపొందించడంతో రూ.3 లక్షలు దాటిదంటే పన్ను పరిధిలోకి వస్తారు. సింగరేణి కార్మికులకు వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. అంటే కనీసం 10 శాతం నుంచి 15 శాతం ఆదాయపు పన్ను స్లాబు పరిధిలోకి వస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఉద్యోగులు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు పొదుపు చేస్తున్నా పరిమితి దాటిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి.
అమలుకు నోచని మినహాయింపు
బొగ్గుగనుల్లో పనిచేసే సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయించాలని చేస్తున్న డిమాండ్ అమలుకు నోచుకోవడం లేదు. పన్ను మినహాయింపు అమలు చేయాలని గత చాలా కాలంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు ఆదాయ పన్ను వర్తింప చేయకూడదని ఆందోళనలు చేశారు. ప్రతీసారి ఈ విషయమై ప్రస్తావిస్తూనే ఉన్నారు. సింగరేణి, సాధారణ ఎన్నికల సమయంలో నాయకులు హామీలు గుప్పిస్తున్నా నేటికీ ఆచరణకు నోచుకోవడం లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ