logo

త్వరలోనే రైల్వే లైన్‌కు భూసేకరణ పూర్తి

కొత్తపల్లి-మనోహరబాద్‌కు సంబంధించిన రైల్వే లైన్‌కు పెండింగ్‌ భూసేకరణను జిల్లాలో పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 05:50 IST

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అధికారులు

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కొత్తపల్లి-మనోహరబాద్‌కు సంబంధించిన రైల్వే లైన్‌కు పెండింగ్‌ భూసేకరణను జిల్లాలో పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. గురువారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖకు చెందిన పరిశ్రమల పాలసీ ప్రోత్సాహక విభాగం ప్రాజెక్టు మానిటరింగ్‌ గ్రూప్‌ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశంలోని అన్ని జిల్లాల్లో పురోగతిలో ఉన్న రోడ్లు, రైల్వేలైన్లకు భూసేకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కొత్తపల్లి- మనోహరబాద్‌ రైల్వేలైన్‌కు భూ సేకరణకు సంబంధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వ అధికారులు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సుమారు 946 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 804 ఎకరాలు భూసేకరణ పూర్తయిందని కలెక్టర్‌ అధికారులకు వివరించారు. ఇప్పటి వరకు తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామం వరకు భూ సేకరణ పూర్తయిందన్నారు. దీనిని రైల్వే శాఖకు అప్పగించినట్లు చెప్పారు. వేములవాడ- నాంపల్లిలో భూ సేకరణ పురోగతిలో ఉందన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమీక్షలో ఇన్‌ఛార్జి డీఆర్‌వో శ్రీనివాస్‌రావు, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్‌ ఉపేందర్‌రావు, పర్యవేక్షకులు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు