logo

దూర విద్య ఒక వరం

చదువుపై ఆసక్తి గల విద్యార్థులకు దూర విద్య ఒక వరం వంటిదని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్‌ వై.వెంకటేశ్వర్లు, చంద్రకళ అన్నారు.

Published : 03 Feb 2023 05:50 IST

శాతవాహన విశ్వవిద్యాలయం: చదువుపై ఆసక్తి గల విద్యార్థులకు దూర విద్య ఒక వరం వంటిదని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్‌ వై.వెంకటేశ్వర్లు, చంద్రకళ అన్నారు. గురువారం కరీంనగర్‌లోని ఎస్సారార్‌లోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించారు. ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సార్వత్రిక విశ్వవిద్యాలయం న్యాక్‌ గుర్తింపునకు వెళ్తుందని అందులో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి రోజు మెయిల్‌ సరి చూసుకుని వాటికి స్పందించాలన్నారు. డిగ్రీ, పీజీ ద్వితీయ, తృతీయ సంవత్సరంలో ప్రవేశాలు తీసుకునేందుకు అవకాశం ఇంకా మిగిలి ఉందన్నారు. ఈ నెల 5 వరకు రూ.500 అపరాధ రుసుంతో ప్రవేశం తీసుకోవచ్చని చెప్పారు. ఇందులో ప్రాంతీయ సమన్వయ అధికారి ఆడెపు శ్రీనివాస్‌, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని