logo

ప్రణాళికతో చదివితే సివిల్స్‌లో విజయం

సివిల్స్‌ సాధించాలనే పట్టుదల, ప్రణాళిక ఉంటే సులభంగా సివిల్స్‌లో విజయం సాధించే అవకాశం ఉందని జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

Published : 05 Feb 2023 05:03 IST

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: సివిల్స్‌ సాధించాలనే పట్టుదల, ప్రణాళిక ఉంటే సులభంగా సివిల్స్‌లో విజయం సాధించే అవకాశం ఉందని జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. శనివారం ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌, ఉన్నత భారత అభియాన్‌, ఎన్‌సీసీ, ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సరైన ప్రణాళికతోపాటు సమయ పాలన, సద్వినియోగం వంటి అంశాలు విజేతగా నిలుపుతాయన్నారు. పుస్తకాల ఎంపిక కూడా కీలకమని నాణ్యమైన వాటిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. కీలకోపన్యాసకులు అక్బరుద్దీన్‌ షోయబ్‌ మాట్లాడుతూ.. సమకాలీన అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామకృష్ణ మాట్లాడుతూ అవగాహన, సాధన ప్రశ్నపత్రాల సరళి, సీనియర్ల సలహాలు తీసుకోవాలని చెప్పారు. వైస్‌ ప్రిన్సిపల్‌ హిమబిందు, అధ్యాపకులు శ్రీనివాస్‌, రాజు, బి.సురేశ్‌ కుమార్‌, వరప్రసాద్‌, నాయుడు, శారద తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని