logo

ట్రాక్టరుతో స్తంభాన్ని తొలగించే యత్నం

పంట పొలంలో వినియోగంలో లేని విద్యుత్తు స్తంభాన్ని తొలగించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృత్యువాత పడిన ఘటన పెద్దపల్లి శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 06 Feb 2023 02:36 IST

మీద పడి డ్రైవర్‌ దుర్మరణం

సంతోష్‌

పెద్దపల్లి, న్యూస్‌టుడే: పంట పొలంలో వినియోగంలో లేని విద్యుత్తు స్తంభాన్ని తొలగించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృత్యువాత పడిన ఘటన పెద్దపల్లి శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై రాజేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారులోని పెద్దమ్మనగర్‌లో పంట పొలంలోని విద్యుత్తు స్తంభాన్ని ట్రాక్టర్‌కు కట్టిన తాడుతో తొలగించేందుకు బంధంపల్లికి చెందిన చిట్టవేన సంతోష్‌(32) ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్తంభం ఒక్కసారిగా ట్రాక్టర్‌పై పడడంతో వాహనం నడుపుతున్న సంతోష్‌ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడం, అక్కడ ఎవరు లేకపోవడంతో కుటుంబసభ్యులకు అర్ధరాత్రి సమాచారం తెలిసింది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదివారం ఉదయం మృతదేహాన్ని సందర్శించి, మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా పంట పొలం యజమాని, ట్రాక్టర్‌ యాజమాని తమకు పరిహారం ఇవ్వాలని మృతుడి బంధువులు ఆందోళన చేశారు. పంటపొలం యాజమానితో రాజీ కుదుర్చుకున్న మృతుడి బంధువులు, ట్రాక్టర్‌ యాజమానితో జరిగిన చర్చలు సఫలం కాలేదు. మృతుడి బంధువులు ఆందోళనకు దిగి, మృతదేహాన్ని ట్రాక్టర్‌ యాజమాని ఇంటి వద్దకు తరలించి నిరసన తెలిపారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరికి ఇరువర్గాల మద్య రాజీ కుదర్చడంతో వివాదం ముగిసింది. సీఐ ప్రదీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ సీఐ అనిల్‌కుమార్‌, ఎస్సైలు రాజేశ్‌, ఉపేందర్‌, శ్రీనివాస్‌, మహేందర్‌, రవిందర్‌ ఇరువర్గాల మధ్య గొడవలు జరగకుండా పర్యవేక్షించారు. మృతుడికి భార్య రజిత, ఇద్దరు పిల్లలున్నారు.


మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని