logo

ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. యువకుడి మృతి

జగిత్యాల మండలం ధరూరు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో ఆదివారం రాత్రి అదుపుతప్పి కారు పడి యువకుడు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి.

Published : 06 Feb 2023 02:36 IST

మృతి చెందిన రిజ్వాన్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల మండలం ధరూరు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో ఆదివారం రాత్రి అదుపుతప్పి కారు పడి యువకుడు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల బీట్‌ బజార్‌కు చెందిన రిజ్వాన్‌(30) తన మిత్రులతో కలిసి అంతర్గాం రహదారిలో వెళుతుండగా కారు అదుపుతప్పి పక్కనే గల ఎస్సారెస్పీ కాల్వలో పడిపోయింది. కాల్వలో నీరు తక్కువగా ఉండటంతో కారులోని మిగతా నలుగురు ప్రాణాలతో బయటపడగా రిజ్వాన్‌ కారులోనే ఇరుక్కుని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. క్షతగాత్రులను జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించగా రిజ్వాన్‌ అప్పటికే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.


అదుపుతప్పి కాల్వలో పడిన కారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని