logo

ఆర్థిక స్తోమత లేని వారికి అండ

కరీంనగర్‌ న్యాయ సేవా ప్రాధికార సంస్థ భవనం పైఅంతస్తులో ఏర్పాటు చేసిన లీగల్‌ ఏయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ సోమవారం ప్రారంభించారు.

Published : 07 Feb 2023 06:03 IST

లీగల్‌ ఏయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జిల్లా జడ్డి ప్రతిమ

చైతన్యపురి, న్యూస్‌టుడే: కరీంనగర్‌ న్యాయ సేవా ప్రాధికార సంస్థ భవనం పైఅంతస్తులో ఏర్పాటు చేసిన లీగల్‌ ఏయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రిమినల్‌ కేసులో నిందితులుగా, విచారణ ఖైదీలుగా ఉండి న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారు దరఖాస్తు చేసుకుంటే లీగల్‌ ఏయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం సభ్యులు ఉచితంగా వాదిస్తారని తెలిపారు. చీఫ్‌ లీగల్‌ ఏయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌గా కృష్ణార్జునాచారి, డిప్యూటీలుగా మహేష్‌, ఆషాడ శ్రీనివాసు, అసిస్టెంట్‌గా గీతాలక్ష్మీప్రసన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎర్రం రాజారెడ్డి, కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని