ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం
ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు.
సమస్యలు వింటున్న కలెక్టర్ యాస్మిన్‌బాషా
జగిత్యాల, న్యూస్‌టుడే: ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ దూరప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి వస్తారని ఇచ్చిన వినతులపై వెంటనే స్పందించి పరిష్కరం చూపాలన్నారు. ఫిర్యాదుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భూసంబంధిత సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా వచ్చిన 33 వినతులపై పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖలకు రాశారు. అదనపు కలెక్టర్లు బీఎస్ లత, మంద మకరందు, ఆర్డీవోలు ఆర్.డి.మాధురి, టి.వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించాలి
జగిత్యాల: మహిళా సంఘ సభ్యుల ఉత్పత్తులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా అన్నారు. జగిత్యాలలో నాబార్డు ఆధ్వర్యంలో ఏర్పాటైన సాధికార మేళా ముగింపు సందర్భంగా సోమవారం ఏర్పాటైన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళలు సంఘాలుగా ఏర్పడి వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తూ వినియోగదారులకు తక్కువ ధరలకు అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. మహిళా ఉత్పత్తిదారులకు ప్రశంసాపత్రాలు జ్ఞాపికలు అందించారు. నాబార్డు ఏజీఎం అనంత్, బీడీఎం మనోహర్‌రెడ్డి, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ పొన్న వెంకట్‌రెడ్డి, ఆర్డీడీవో కె.లక్ష్మినారాయణ, సహకార బ్యాంకు సీఈవో సత్యనారాయణరావుతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ
-
Movies News
Social Look: ఫొటో ఎంపిక చేసుకోమన్న యషిక.. పెయింటింగ్‌ని తలపించేలా మీనాక్షి స్టిల్!
-
Politics News
DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకేఎస్.. వీడియో వైరల్