అవినీతి ప్రభుత్వాలను గద్దె దించడమే లక్ష్యం
మత విద్వేశాలను రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వం, అవినీతి కుటుంబ పాలన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా రాహుల్‌గాంధీ పిలుపు మేరకు హాథ్ సే హాథ్ జోడో యాత్రను చేపట్టినట్లు డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
ధర్మపురిలో యాత్రను ప్రారంభిస్తున్న డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్, కాంగ్రెస్ కౌన్సిలర్లు
ధర్మపురి, న్యూస్‌టుడే: మత విద్వేశాలను రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వం, అవినీతి కుటుంబ పాలన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా రాహుల్‌గాంధీ పిలుపు మేరకు హాథ్ సే హాథ్ జోడో యాత్రను చేపట్టినట్లు డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి కార్యకర్తలతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని భారత్‌జోడో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలకు కొనసాగింపుగా రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు ధర్మపురికి భారీగా నిధులు మంజూరు చేసి మరో తిరుపతిగా మారుస్తామని హామీ ఇచ్చారని అవేమీ నేటికీ నెరవేరలేదన్నారు. మంత్రి ఈశ్వర్ ఇప్పటి వరకు ధర్మపురిని రెవెన్యూ డివిజన్‌గా మార్చలేదన్నారు. నియోజవర్గంలో తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రతీ గడపకు తీసుకువెళతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, ధర్మపురిలో పుర కాంగ్రెస్ కౌన్సిలర్లు నాగలక్ష్మి, సంతోషీ, పద్మ, అరుణ, మండలాల అధ్యక్షులు సంగనభట్ల దినేష్(ధర్మపురి), రాములుగౌడ్(పెగడపల్లి), శైలేందర్‌రెడ్డి(వెల్గటూర్), శ్రీనివాస్(ధర్మారం), సుభాష్(బుగ్గారం)తదితరులు పాల్గొన్నారు. ఉదయం పదిన్నర నుంచి రెండు గంటల పాటు పది వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె