logo

ఆరోగ్య ఉప కేంద్రాలకు మహర్దశ

నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. పలు కేంద్రాలకు సొంత భవనాలు సమకూరనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు సొంత భవనాలు లేక పంచాయతీ కార్యాలయాలు, అద్దె గదుల్లో అసౌకర్యాల మధ్య సేవలు అందిస్తుండగా కొన్ని సొంత భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

Published : 07 Feb 2023 06:03 IST

36 భవనాల నిర్మాణానికి రూ.7.20 కోట్లు మంజూరు
న్యూస్‌టుడే, మెట్‌పల్లి

నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. పలు కేంద్రాలకు సొంత భవనాలు సమకూరనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు సొంత భవనాలు లేక పంచాయతీ కార్యాలయాలు, అద్దె గదుల్లో అసౌకర్యాల మధ్య సేవలు అందిస్తుండగా కొన్ని సొంత భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వైద్యసేవలు అందించడంలో సిబ్బంది, సేవలు పొందడంలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించగా ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల పరిస్థితిని వివరించారు. నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. హామీ ఇచ్చిన మంత్రి శుక్రవారం కోరుట్ల నియోజకవర్గంలోని 36 ఆరోగ్య కేంద్రాల సొంత భవనాల నిర్మాణానికి రూ.7.20 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు సమకూరడం వల్ల గ్రామాలు, పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


పంచాయతీ భవనంలోనే..

ఇది మెట్పల్లి మండలం జగ్గాసాగర్‌లోని ఆరోగ్య ఉప కేంద్రం. ఇక్కడ సొంత భవనం లేక గ్రామ పంచాయతీలోని ఓ చిన్న గదిలో ఏర్పాటు చేశారు. పంచాయతీలో నిర్వహిస్తుండడంతో అవసరాల నిమిత్తం పంచాయతీ కార్యాలయానికి వచ్చే వారు, వైద్యం కోసం వచ్చే వారు అసౌకర్యానికి గురవుతున్నారు. నూతన భవన నిర్మాణంతో ఇబ్బందులు తొలగనున్నాయి.


మండలాల వారీగా మంజూరైన నూతన భవనాలు

మెట్పల్లి పట్టణం: రేగుంట, ముస్లింపుర, ఇంద్రానగర్‌, దుబ్బవాడ, అంబేడ్కర్‌నగర్‌

మెట్పల్లి మండలం: వేంపేట, మెట్లచిట్టాపూర్‌, కొండ్రికర్ల, వెల్లుల్ల, జగ్గాసాగర్‌, మేడిపల్లి

కోరుట్ల మండలం: మాదాపూర్‌, జోగిన్‌పల్లి, చిన్నమెట్పల్లి, అయిలాపూర్‌ -1, అయిలాపూర్‌ -2, యూసుఫ్‌నగర్‌, మోహన్‌రావుపేట, కోరుట్ల పట్టణంలో మూడు భవనాలు

మల్లాపూర్‌: వేంపల్లి, మల్లాపూర్‌, రాఘవపేట, సాతారం, కొత్తదాంరాజ్‌పల్లి, మొగిలిపేట, చిట్టాపూర్‌, సిర్పూర్‌

ఇబ్రాహీంపట్నం: గోదూర్‌, వర్షకొండ, ఎర్దండి, తిమ్మాపూర్‌, డబ్బా, ఇబ్రహీంపట్నం-1, ఇబ్రహీంపట్నం-2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు