logo

ఉన్నత లక్ష్యాల సాధనకు శ్రమించాలి

విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని సాధనకు శ్రమించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు.

Updated : 08 Feb 2023 07:19 IST

పత్తిపాకలో భోజనశాలను ప్రారంభిస్తున్న మంత్రి ఈశ్వర్‌, చిత్రంలో పాలనాధికారిణి సంగీత తదితరులు

ధర్మారం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని సాధనకు శ్రమించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. ధర్మారం మండలం పత్తిపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో రూ.24.41 లక్షలు, రూ.61 లక్షలు ఉపాధిహామీ నిధులతో చేపట్టిన భోజనశాల, డిజిటల్‌ తరగతి గది తదితర వసతులను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాఠశాలలు, గురుకులాల్లో మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామనడానికి ఆయా పాఠశాల విద్యార్థులకు ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు లభించడమే నిదర్శనమన్నారు. కలెక్టర్‌ డా.సర్వే సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం మొదటి విడతలో 191 పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు కల్పించామని వివరించారు. మండల పరిషత్తు కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, డీఈవో మాధవి, ఎంపీపీ కరుణశ్రీ, జడ్పీటీసీ సభ్యురాలు పద్మజ, సహకార సంఘాలు, ఏఎంసీ ఛైర్మన్లు బలరాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, ఎంఈవో చాయాదేవి, తహసీల్దారు శ్రీనివాస్‌, ఎంపీడీవో జయశీల తదితరులు పాల్గొన్నారు.

న్యాక్‌ కేంద్రం ప్రారంభం

ధర్మారంలో ఇటీవల కొత్తగా మంజూరైన న్యాక్‌ కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మంగవారం ప్రారంభించారు. శిక్షణ పొందేందుకు నమోదుచేసుకున్న వారికి పరికరాలు అందించారు. ఏడీ పి.అశోక్‌కుమార్‌, కేంద్రం ఇన్‌ఛార్జి జి.రామనారాయణ తదితరులు పాల్గొన్నారు. సెర్ప్‌ ఉద్యోగులు ముద్రించిన 2023 కాలమానిని మంత్రి ఆవిష్కరించారు. సెర్ప్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు అపర్ణ, ఏపీఎం తులసి, సీసీలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని