logo

‘ప్రజల సొమ్ము పార్టీ అవసరాలకా!’

సామాన్య ప్రజలు కట్టిన పన్నులతో వచ్చిన ఆదాయాన్ని ప్రత్యేక నిధిగా రూ.వెయ్యి కోట్లను వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్నారని.. ఈ ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాలలో భారాస ప్రచారం.

Published : 09 Feb 2023 05:24 IST

కొత్తపేట ఎస్సీ కాలనీలో పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌

ఎండపల్లి (వెల్గటూరు), న్యూస్‌టుడే: సామాన్య ప్రజలు కట్టిన పన్నులతో వచ్చిన ఆదాయాన్ని ప్రత్యేక నిధిగా రూ.వెయ్యి కోట్లను వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్నారని.. ఈ ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాలలో భారాస ప్రచారం కోసం కేటాయించారని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. బుధవారం ఎండపల్లి, వెల్గటూరు మండలాల్లోని చెర్లపల్లి, జగదేవుపేట, కొత్తపేట, వెల్గటూరు, కొండాపూర్‌, రాజారాంపల్లి గ్రామాల్లో బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పథకాల్లో దోచుకున్న సొమ్ము గురించి ప్రశ్నించకుండా ఉండేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులకు ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మద్దెల నారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి నక్క విజయ్‌, మండలాధ్యక్షుడు బచ్చలి స్వామి, లాలాగౌడ్‌, షాహిన్‌బేగం, తదితరులు పాల్గొన్నారు.

రైతు కుటుంబానికి పరామర్శ

జగిత్యాల గ్రామీణం: జగిత్యాల మండలం నర్సింగాపూర్‌కు చెందిన రైతు గడ్డం జలపతిరెడ్డి ఇటీవల బలవన్మరణం చెందగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు ఆత్మహత్యకు కారకుడైన న్యాయవాదిని అరెస్టు చేసి బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు బీఎస్పీ నాయకులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి న్యాయం చేయాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దెల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లపల్లి సంపత్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు దేవిసింగ్‌రాథోడ్‌, బీవీఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ తిరుపతి తదితరులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు