logo

ధరణిలో పేర్లు తొలగించాలని ఆందోళన

కరీంనగర్‌ గ్రామీణ మండలం నగునూరులోని ఓ సర్వే నంబరులోని ప్రభుత్వ భూమి 26.08 ఎకరాల స్థలంలో అక్రమంగా ధరణిలో చొరబడిన స్థానికేతరుల పేర్లను తొలగించి గ్రామానికి చెందిన నిరుపేదలకు పంపిణీ చేయాలని సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నగునూరుకు చెందిన నిరుపేదలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.

Published : 21 Mar 2023 06:16 IST

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న నగునూరు గ్రామస్థులు

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ గ్రామీణ మండలం నగునూరులోని ఓ సర్వే నంబరులోని ప్రభుత్వ భూమి 26.08 ఎకరాల స్థలంలో అక్రమంగా ధరణిలో చొరబడిన స్థానికేతరుల పేర్లను తొలగించి గ్రామానికి చెందిన నిరుపేదలకు పంపిణీ చేయాలని సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నగునూరుకు చెందిన నిరుపేదలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేడ్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి అమర్‌నాథ్‌, కరీంనగర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కాంపెల్లి కీర్తికుమార్‌, గడప కాంతమ్మ, చంటి శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌ దావు సంతోశ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని