logo

సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు.

Updated : 21 Mar 2023 06:35 IST

ప్రజావాణిలో కలెక్టర్‌ కర్ణన్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 171 దరఖాస్తులను స్వీకరించామన్నారు. దరఖాస్తులను అక్కడికక్కడే సంబంధిత శాఖలు పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.  


కనీస వేతన నిర్ణయం చేయాలి

మూగజీవాలకు సేవలందిస్తున్న పశుమిత్రలకు జీ 60 ప్రకారం కనీస వేతనం రూ.15,600 ఇవ్వాలని, సెర్ప్‌ కార్మికులుగా గుర్తించాలని కలెక్టర్‌ను కోరారు. సంఘం గౌరవ అధ్యక్షుడు ఎడ్ల రమేశ్‌, జిల్లా అధ్యక్షులు జాడి లలిత, కార్యదర్శి ప్రభ, ఇతర సభ్యులున్నారు.


వితంతు పింఛను ఇప్పించరూ..

తనకు వితంతు పింఛను ఇప్పించాలని, దివ్యాంగుడైన తన కుమారుడితో కలిసి నగరానికి చెందిన సీహెచ్‌.అనిత వినతి అందజేశారు. తన భర్త గతంలో మృతిచెందాడని, గతంలోనే పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


రైతులను ఆదుకోవాలి : కాంగ్రెస్‌

వడగళ్లతో పంట నష్టం అంచనా వేసి నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేసి బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతూ కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌.. పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. చొప్పదండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేడిపల్లి సత్యం, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని