logo

అవగాహనతోనే నివారణ

దేశంలో పెరుగుతున్న జనాభాతో పాటు వ్యాధుల సంఖ్య వీపరీతంగా పెరిగిపోతోంది. సమాజంలో మాములుగా అందరి మధ్య ఉండి త్వరగా ప్రభాలే వ్యాధి క్షయ.గతంలో ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన క్షయ వ్యాధి వేగంగా తన ప్రభావాన్ని చూపుతోంది.

Published : 24 Mar 2023 04:14 IST

నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
న్యూస్‌టుడే, జగిత్యాల, రాయికల్‌, ధర్మపురి

సిబినాట్‌ పరీక్ష యంత్రం వద్ద వైద్యులు

దేశంలో పెరుగుతున్న జనాభాతో పాటు వ్యాధుల సంఖ్య వీపరీతంగా పెరిగిపోతోంది. సమాజంలో మాములుగా అందరి మధ్య ఉండి త్వరగా ప్రభాలే వ్యాధి క్షయ.గతంలో ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన క్షయ వ్యాధి వేగంగా తన ప్రభావాన్ని చూపుతోంది. ప్రతి వెయ్యి మందిలో 10 మందికి వ్యాధి సోకి అస్వస్థతకు గురవుతుండగా బాధితులకు తెలియకుండానే ఇతరులకు వ్యాప్తి చేస్తున్నారు.  ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా క్షయ వ్యాధి నిర్మూలన చర్యలపై న్యూస్‌టుడే ప్రత్యేక కథనం.  

ఉచిత నిర్ధారణ(సిబినాట్‌) పరీక్షలు

జగిత్యాల జిల్లాలో గతేడాది 1832 కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 22 వరకు 396 కేసులు నమోదు కాగా బాధితులకు చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల ఆరోగ్య సిబ్బందితో పాటు ప్రయివేటు ఆసుపత్రుల సహాయంతో రెండు వారాలకు మించి దగ్గు కలిగి, బరువు తగ్గి, జ్వరంతో బాధపడుతున్న లక్షణాలు గల రోగులను గుర్తించి జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో నూతన సాంకేతిక పద్ధతి సిబినాట్‌ యంత్రంతో(కళ్లె) తెమడ పరీక్షలు ఉచితంగా నిర్వహించి క్షయ బాధితులను గుర్తిస్తున్నారు. ప్రతి వ్యక్తి దేహంలో టి.బి. బ్యాక్టిరియా ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా టీహబ్‌ ద్వారా ఇగ్రా పరీక్షలను ప్రారంభించింది. తొలుత టి.బి. రోగుల కుటుంబ సభ్యులకు ఈ పరీక్షలను ప్రారంభించారు. ఐ.జి.ఆర్‌.ఏ పరీక్ష ద్వారా దేహాంలో టి.బి.బ్యాక్టిరియా ఉన్నట్లు గుర్తిస్తే భవిష్యత్తులో టి.బి.రాకుండా పాజిటివ్‌ వ్యక్తులకు వెంటనే ఆరుమాసాల పాటు ఐ.ఎన్‌.ఏచ్‌. మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నిక్షయ మిత్ర కార్యక్రమం ద్వారా దాతల సాయంతో క్షయ వ్యాధిగ్రస్థులకు పోషకాహార కిట్లను ఈ ఏడాది ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.500 తో పాటు దాతల సాయంతో పోషకారహార కిట్లను అందిస్తున్నారు. జిల్లాలో ఐఎంఏ ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ ఏడాది పోషకాహార కిట్లను సుమారు 250 మందికి అందజేశారు.


గ్రామాల్లో బాధితుల గుర్తింపు

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో గ్రామాలలో క్షయవ్యాధి బాధితులను గుర్తించి జిల్లా వైద్యశాలలోని సిబినాట్‌ యంత్రం ద్వారా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నాం. వ్యాధి నిర్ధారన జరిగిన బాధితులకు ఉచితంగా మందులతో పాటు ప్రతి నెల పోషణ భత్యం కింద రూ.500 అందిస్తున్నాం. నిక్షయ మిత్ర ద్వారా దాతలు క్షయ వ్యాధిగ్రస్థులకు సాయం అందించాలి.

డా.పుప్పాల శ్రీధర్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖధికారి


అవగాహన కల్పిస్తున్నాం..

జిల్లాలో క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. క్షయ వ్యాధికి ఆరు మాసాల పాటు ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తున్నాం. మొండి(యం.డీ.ఆర్‌) టి.బి. వ్యాధిగ్రస్థులకు సైతం జిల్లా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. క్షయ వ్యాధి వ్యాప్తి కాకుండా బాధితుల కుటుంబ సభ్యులకు వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నాం. 

డా.నీలగిరి శ్రీనివాస్‌,  క్షయ నిర్మూలన అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు