logo

స్వచ్ఛభారత్‌లో తెలంగాణ నంబర్‌ వన్‌

స్వచ్ఛభారత్‌లో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని అందులో జగిత్యాల నియోజవర్గంలో గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ అన్నారు.

Published : 24 Mar 2023 04:14 IST

అవార్డులు పొందిన సర్పంచులతో ఎమ్మెల్యే సంజయ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: స్వచ్ఛభారత్‌లో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని అందులో జగిత్యాల నియోజవర్గంలో గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ అన్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు గెలుచుకున్న గ్రామ పంచాయతీలకు నియోజకవర్గ స్థాయిలో అవార్డులను స్థానిక శుభమస్తు గార్డెన్‌లో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా అవార్డులు గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచులను, పంచాయతీ కార్యదర్శులను ఆయన అభినందించారు. పట్టణాలకు వలస వెళ్లిన వారు పల్లెలకు తిరిగి వస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీడీవోలు, సర్పంచులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని