logo

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం

నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, లీకేజీకి బాధ్యులైన టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌, కార్యదర్శులను వెంటనే సస్పెండ్‌ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 24 Mar 2023 04:14 IST

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ధ్వజం

ఆలయంలో పూజలు చేస్తున్న పొన్నం ప్రభాకర్‌

ధర్మపురి, న్యూస్‌టుడే : నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, లీకేజీకి బాధ్యులైన టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌, కార్యదర్శులను వెంటనే సస్పెండ్‌ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మంత్రులు మద్యం కుంభకోణం గురించి మాట్లాడుతున్నారే తప్ప, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న పరీక్షల లీకేజీ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదన్నారు. రూ.వంద కోట్ల మద్యం కుంభకోణంపై భాజపా ప్రభుత్వం విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని, ఎందుకు కవితను అరెస్టు చేయడం లేదో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారని, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని అణచలేరన్నారు. సీఎం బాధితులకు కంటితుడుపు ఓదార్పు ఇవ్వకుండా, నష్టపోయిన ప్రతి రైతును స్పష్టమైన హామీతో ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. దినేష్‌, ప్రసాద్‌, రాజేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని