logo

సాంబ సదాశివాలయం పునర్నిర్మాణానికి అడుగులు

ఓదెల మండలంలోని కొలనూరులో కాకతీయుల కాలం నాటి పురాతన సాంబ సదాశివాలయం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఆలయాన్ని ఇటీవల తొలగించిన విషయం విదితమే.

Published : 24 Mar 2023 04:14 IST

కొలనూరులో ఆలయ నిర్మాణానికి హోమం నిర్వహిస్తున్న రుత్వికులు, గ్రామస్థులు

ఓదెల, న్యూస్‌టుడే: ఓదెల మండలంలోని కొలనూరులో కాకతీయుల కాలం నాటి పురాతన సాంబ సదాశివాలయం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఆలయాన్ని ఇటీవల తొలగించిన విషయం విదితమే. నాటి రాతి స్తంభాలతో కూడిన ఆలయ పునర్నిర్మాణానికి గురువారం గ్రామంలో భూమిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయ నిర్మాణానికి సీజీఎఫ్‌ నిధులు రూ.38 లక్షలు మంజూరయ్యాయి. స్థానికులు రూ.9.5 లక్షలు ఇచ్చారు. రూ.1.80 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ నిర్మాణం చేయనున్నారు. మిగతా నిధులు దాతల సాయంతో సమకూర్చి పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేశారు. కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ సహిత ఏకాదశ వాస్తుపూజ, శిలామూర్తికి అభిషేకం, ఆలయ అడుగు భాగం భూగర్భంలో శిలా ప్రతిష్ఠాపనం, రుద్రహోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను వైభవంగా చేపట్టారు. యాంసాని మోహన్‌దాస్‌ భక్తులకు అన్నదానం చేశారు. జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు, సర్పంచులు సామ మణెమ్మ, మధు, మల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కారెంగుల శ్రీనివాస్‌, ఉప సర్పంచి పాకాల సంపత్‌రెడ్డి, మాజీ సర్పంచులు సామ శంకర్‌, కుంచం మల్లయ్య, ఆలయ కమిటీ బాధ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు