logo

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రమాద నష్టం రూ.2 కోట్లు

కరీంనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ఏజీఎం వి.చిరంజీవి తెలిపారు.

Updated : 24 Mar 2023 04:42 IST

కాలిపోయిన పరికరాలు

కరీంనగర్‌ నేరవార్తలు: కరీంనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ఏజీఎం వి.చిరంజీవి తెలిపారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు ఇక్కడి నుంచే మొబైల్‌, ల్యాండ్‌ లైన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుతాయి. ఈ సేవలు సరఫరా కావడానికి ముఖ్యమైన స్విచ్‌ గది పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదన్నారు. ఈ గది పూర్తిగా ఏసీలో ఉంటుందని చెప్పారు. తమ సిబ్బంది స్పందించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. మొబైల్‌, ల్యాండ్‌ లైన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు తాత్కాలిక పద్ధతిలో కొనసాగించేందుకు రేణికుంట, జూలపల్లి, బొయినిపల్లి, గర్రెపల్లి నుంచి కొంత అత్యవసర సామగ్రిని తీసుకొచ్చామన్నారు. మూడ[ు, నాలుగు రోజుల్లో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని ఏజీఎం వి.చిరంజీవి తెలిపారు. ప్రమాద విషయం తెలియడంతో హైదరాబాద్‌ నెట్‌వర్క్‌ విభాగం అధికారులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. ఏజీఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు కరీంనగర్‌ ఒకటో ఠాణా సీఐ నటేష్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని