స్వశక్తి.. స్వయం ఉపాధిపై ఆసక్తి
ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా.. తీసుకున్న రుణాన్ని చెల్లించడంతోపాటు ఏదైనా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి పలు మహిళా సంఘాల సభ్యులు ముందుకొస్తున్నారు.
న్యూస్‌టుడే, కరీంనగర్ సుభాష్‌నగర్: ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా.. తీసుకున్న రుణాన్ని చెల్లించడంతోపాటు ఏదైనా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి పలు మహిళా సంఘాల సభ్యులు ముందుకొస్తున్నారు. నచ్చిన రంగంలో ఆసక్తి ఉన్న వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. అలాంటి వారికి కరీంనగర్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రోత్సాహం ఇస్తోంది. స్వశక్తి సంఘాల సభ్యులకు రుణాలు అందిస్తోంది. స్వశక్తి సంఘాల్లోని సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉపాధి బాటలు వేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాకు కేంద్రమైన నగరంలో అలాంటి సంఘాల్లోని పలువురు మహిళలపై ‘న్యూస్‌టుడే’ కథనం.
అల్లం వెల్లుల్లి విక్రయం
అల్లం తయారు చేస్తున్న శ్యామల
మార్కండేయనగర్‌కు చెందిన శ్యామల వైజయంతి సంఘంలో సభ్యురాలు. సంఘంలో వచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇంటి వద్దే ఉంటూ ఉపాధి పొందాలని భావించారు. ఇంటి వద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. చింతకాయ, టమాటా చట్నీలు తయారు చేసి అమ్మడంతో వ్యాపారం క్రమేణ విస్తరించింది. మొదట రూ.లక్ష రుణం తీసుకొని తీర్చేశారు. ఇప్పుడు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టారు. నాలుగు యంత్రాలను సమకూర్చుకున్నారు. తాను తయారు చేసిన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని తెలిపారు.
జ్యూట్ బ్యాగుల తయారీ
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ ఆదర్శనగర్‌కు చెందిన గానుగపండ హేమలత. ఈమె ఎంఏ సోషియాలజీ చేశారు. శ్రీసాయి మహిళా స్వశక్తి సంఘంలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. గతంలో ఆర్ట్ అండ్ క్రాప్ట్‌లో ఆసక్తి ఉండటంతో సంచులు తయారు చేసి విక్రయించేవారు. ఆ తర్వాత జ్యూట్ సంచులు తయారు చేయడం మొదలుపెట్టారు. రూ.5 వేల పెట్టుబడితో ఆర్డర్లకు అనుగుణంగా రకరకాల డిజైన్లతో జ్యూట్ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.3.21 లక్షల మేర రుణాలు తీసుకున్నారు. ఆర్డర్లు మరింత పెరిగిపోవడంతో తనతోపాటు మరో ముగ్గురు మహిళలకు ఉపాధి ఇస్తున్నారు. అంతేకాకుండా సిద్దిపేట, కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో, చొప్పదండిలోని మల్లాపూర్ బాలికల గురుకుల కళాశాల విద్యార్థినులకు జ్యూట్ బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చారు. నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని తీసుకున్న రుణాలు చెల్లిస్తూ వ్యాపార అభివృద్ధి సాధిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు