logo

యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శనివారం జిల్లా అదనపు పాలనాధికారి జీవీ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌ తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Published : 26 Mar 2023 05:05 IST

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌

కరీంనగర్‌ మంకమ్మతోట, న్యూస్‌టుడే: యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శనివారం జిల్లా అదనపు పాలనాధికారి జీవీ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌ తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు ఏజెన్సీల జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద తాత్కాలిక విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. కొనుగోలులో అవకతవకలు జరిగితే క్లస్టర్‌ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యవసాయ విస్తరణాధికారులు ధాన్యం నాణ్యతను పరిశీలించి ధ్రువీకరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, డీసీవో శ్రీమాల, డీఎంవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని