logo

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

పోలీసు ఠాణాలకు చెందిన ఎస్‌హెచ్‌వోలు పెండింగ్‌ కేసులు తగ్గించాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎల్‌.సుబ్బారాయుడు ఆదేశించారు.

Updated : 26 Mar 2023 05:17 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసు ఠాణాలకు చెందిన ఎస్‌హెచ్‌వోలు పెండింగ్‌ కేసులు తగ్గించాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎల్‌.సుబ్బారాయుడు ఆదేశించారు. శనివారం కమిషనరేట్లో ఎస్‌హెచ్‌వోలు, కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. నేరాలను ఛేదించడాన్ని సవాల్‌గా తీసుకోవడంతోపాటు నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు డీసీపీ చంద్రమోహన్‌, ఏసీపీ కాశయ్య ఉన్నారు.


కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

​​​​​​​

చెక్కు అందిస్తున్న సీపీ

కరీంనగర్‌ నేరవార్తలు : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి శనివారం  కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎల్‌.సుబ్బారాయుడు బీమా డబ్బులు అందజేశారు. ధర్మపురి పోలీస్‌ ఠాణాలో పని చేసిన కానిస్టేబుల్‌ వెంకటరమణచారి నాలుగు నెలల కిందట మృతి చెందారు. పోలీస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఇన్సూరెన్స్‌ ద్వారా మంజూరైన రూ.4 లక్షలు అందజేశారు. పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.సురేందర్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని