logo

సర్వే చేసి.. నివేదికలు ఇవ్వండి

నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటల నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సూచించారు.

Published : 26 Mar 2023 05:05 IST

అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

గంగాధర, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటల నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సూచించారు. బూర్గుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆరు మండలాల వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదికలు తయారు చేయాలని తెలిపారు.

గంగాధర : ఉమ్మడి రాష్ట్రంలో అంగన్‌వాడీల సమస్యలు పట్టించుకోలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రూ.7 వేలు ఉన్న జీతం రూ. 13,600 పెంచి వారికి అండగా నిలిచినట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తెలిపారు. గంగాధరలో శనివారం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, అంగన్‌వాడీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని