logo

ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వండి

కార్డియో పల్మనరీ రెసిటేషన్‌ (సీపీఆర్‌), ఆటోమేటెడ్‌ ఎక్స్టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌(ఏఈడీ)పైన అన్ని శాఖల్లోని ఉద్యోగులు తప్పనిసరిగా శిక్షణ పొందాలని జిల్లా పాలనాధికారి కర్ణన్‌ శిక్షణ కోఆర్డినేటర్‌కు సూచించారు.

Published : 26 Mar 2023 05:05 IST

ఆర్టీఏ కార్యాలయంలో సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్న వైద్యులు

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కార్డియో పల్మనరీ రెసిటేషన్‌ (సీపీఆర్‌), ఆటోమేటెడ్‌ ఎక్స్టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌(ఏఈడీ)పైన అన్ని శాఖల్లోని ఉద్యోగులు తప్పనిసరిగా శిక్షణ పొందాలని జిల్లా పాలనాధికారి కర్ణన్‌ శిక్షణ కోఆర్డినేటర్‌కు సూచించారు. శనివారం కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న  శిక్షణ తరగతులను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జువేరియా, తహసీల్దార్‌ డాక్టర్‌ నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్‌ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో కార్డియో పల్మనరి రేసిటేషన్‌ (సీపీఆర్‌)పై అవగాహన కల్పించారు. సొసైటీ ఛైర్మన్‌, కార్యదర్శి పెండ్యాల కేశవరెడ్డి, ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చాలామంది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ అనుమానాలను నివృత్తి చేశారు. ఎంవీఐ నాగలక్ష్మి, ఏఎంవీఐ రజనీదేవి, డాక్టర్‌ చరణ్‌సాయి, ఆర్టీఏ కార్యాలయ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని