ఎప్పుడు పూర్తయ్యేనో!
ప్రజల రాకపోకల కోసం, వాగులో ప్రవహించే వరద నీరు నిలిచి కోరుట్ల పట్టణంలో భూగర్భజలాలు పెంచేందుకు చేపట్టిన వంతెన, చెక్‌డ్యాం నిర్మాణం నిధుల లేమితో ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిపోయింది.
నిధులు లేక నిలిచిన వంతెన, చెక్‌డ్యాం
కోరుట్ల-సంగెం వాగులో నిలిచిపోయిన వంతెన, చెక్‌డ్యాం నిర్మాణం
న్యూస్‌టుడే, కోరుట్ల: ప్రజల రాకపోకల కోసం, వాగులో ప్రవహించే వరద నీరు నిలిచి కోరుట్ల పట్టణంలో భూగర్భజలాలు పెంచేందుకు చేపట్టిన వంతెన, చెక్‌డ్యాం నిర్మాణం నిధుల లేమితో ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిపోయింది. పూరిస్థాయి నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కోరుట్ల పట్టణ శివారులోని సంగెం రోడ్డులోనున్న పెద్దవాగుపై వంతెన, చెక్‌డ్యాం నిర్మించేందుకు 2016లో నాబార్డు నిధులు రూ.3.5 కోట్లను కేటాయించారు. జనవరి 20, 2017లో అప్పటి ప్రజాప్రతినిధులు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. వంతన, చెక్‌డ్యాం పూర్తిస్థాయి నిర్మాణానికి సుమారు రూ.8 కోట్ల నిధులు అవసరం కాగా గడిచిన ఆరేళ్లలో కేవలం రూ.3.5 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో వాగులో పుట్టింగ్ చేపట్టి 11 పిల్లర్లు, ఇరువైపులా గోడ నిర్మించారు. వాగులో నీరు నిలిచేందుకు పిల్లర్ల మధ్య అడ్డుగా వాల్‌ను నిర్మించారు.
అన్నదాతలకు ఇక్కట్లు
రెండేళ్లుగా వర్షాకాలంలో భారీ వర్షాలకు వాగులో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వంతెనకు ఇరువైపులా నిర్మించిన గోడల పక్కన పెద్దఎత్తున మట్టి కోతకు గురైంది. దీంతో వంతెన గోడలను మరింత దూరంగా పెద్దగా నిర్మించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి నిర్మాణాలకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంది. మూడేళ్లుగా వంతెన పిల్లర్లపై స్లాబులు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో గుత్తెదారు పనులను మధ్యలోనే వదిలేశాడు. వాగులోంచి అన్నదాతలు, సంగెం, నాగులపేట గ్రామస్థులు రాకపోకలు సాగించేందుకు తాత్కాలికంగా రోడ్డును నిర్మించారు. వర్షాలకు వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వాగులో నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ప్రజల రాకపోకలకు పైపులు వేయడంతో దానిపై తాత్కాలికంగా మట్టిరోడ్డును ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. దీంతో ప్రజలు, ద్విచక్ర వాహనదారులు వాగులో ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నారు. వాగు అవతలి వైపున కోరుట్లకు చెందిన రైతులవి వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. అన్నదాతలు వర్షాకాలంలో తమ పొలాలకు వెళ్లేందుకు 8 కిలోమీటర్ల దూరం తిరిగి సంగెం గ్రామం మీదుగా వెళ్తూ ఇక్కట్లు పడుతున్నారు. వంతెన నిర్మాణ పూర్తికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ‘న్యూస్‌టుడే’ పంచాయతీరాజ్ ఏఈ ఆదిత్యను సంప్రదించగా.. వంతెన పూర్తిస్థాయి నిర్మాణం కోసం రెండేళ్ల కిందట రూ.3.5 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. నిధులు మంజూరుకాగానే పిల్లర్లపై స్లాబ్‌లను నిర్మించి వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు