మళ్లిపోనున్న నిధులు
గ్రామాల్లో సీసీ, మట్టి రహదారులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) కింద నిధులు మంజూరు చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కోరుట్ల మండలానికి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ఈజీఎస్ కింద చేపట్టిన పనులకు నెలాఖరు వరకే అవకాశం
న్యూస్‌టుడే, కోరుట్లగ్రామీణం
ధర్మారం గ్రామంలో నిర్మించిన సీసీ రహదారి
గ్రామాల్లో సీసీ, మట్టి రహదారులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) కింద నిధులు మంజూరు చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కోరుట్ల మండలానికి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోరుట్ల నియోజకవర్గంలో ఒక్కో గ్రామానికి రూ.10 నుంచి రూ.30 లక్షల వరకు నిధులు మంజూరు చేశారు. ఈ పనులను ఈనెల 31 వరకు పూర్తి చేయాల్సి ఉంది. పనులు ప్రారంభించకుండా పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి మళ్లిపోతాయి. నిధులు ఖర్చుచేయక పోతే వచ్చే ఏడాది నిధుల నుంచి బిల్లులు మంజూరవుతాయి. జిల్లాలోని 18 మండలాలకు రూ.36.74 కోట్లు మంజూరు కాగా ఇంత వరకూ రూ.31.45 కోట్లు నిధులు వినియోగించారు. కోరుట్ల మండలానికి ఈజీఎస్ నిధులు రూ.3.60 కోట్లు రెండు నెలల కిందట మంజూరు కాగా 1.40 కోట్ల నిధులు ఖర్చు చేశారు. కొన్ని గ్రామాల్లో సీసీ రహదారులు వేయగా మరికొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. కోరుట్ల మండలం జోగన్‌పల్లి గ్రామం నుంచి కల్లూర్ గ్రామం వరకూ మట్టి రోడ్డు వేయడానికి రూ.కోటి నిధులు, కల్లూర్ నుంచి ధర్మారం వరకూ మట్టి రోడ్డు నిర్మాణానికి రూ.70 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకూ ఈ పనులకు టెండర్లు వేసేందుకు గుత్తెదారులు ముందుకు రాకపోవడం గమనార్హం.
బిల్లుల కోసం ఎదురుచూపులు
గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు అప్పగించారు. కోరుట్ల మండలంలో ఎనిమిది గ్రామాల్లో రూ.1.20 కోట్ల వరకూ సీసీ రహదారుల పనులు చేపట్టారు. పనులు పూర్తి చేసిన వారు బిల్లుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వడ్డీకి డబ్బులు తెచ్చి రోడ్లు నిర్మించినా బిల్లులు చెల్లింపుల్లో అలస్యం కావడంతో గిట్టుబాటు కాక పోవడంతో పాటు నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
రెండు నెలల ముందు మంజూరు
జనవరి నెలలో కేంద్రం నిధులు మంజూరు చేయడంతో గ్రామాల్లో సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణాలను హడావిడిగా చేపడుతున్నారు. రూ.5 లక్షల వరకైతే నామినేషన్ పద్ధతిపై అంతకంటే ఎక్కువగా ఉంటే టెండర్లు ఖరారు చేయాలి. అలా కాకుండా గ్రామపంచాయతీల్లో పనులను విభజించి నామినేషన్ పద్ధతిలో పూర్తి చేశారు. ఉపాధి హామీలో 60 శాతం కూలీలు, 40 శాతం సామగ్రి(మెటీరియల్ కాంపొనెట్)తో రహదారి పనులు పూర్తి చేయాలి. బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుందని పనులు చేపట్టడం లేదని పనులు దక్కించుకున్న వారు వాపోతున్నారు.
పూర్తి చేయాలని సూచించాం
గోపాల్‌రెడ్డి, పంచాయతీరాజ్ డీఈఈ కోరుట్ల
సీసీ రహదారుల పనులు ఈ నెలాఖరు వరకూ పూర్తి చేయాలని పనులు దక్కించుకున్నా వారికి తెలియజేశాం. ఖర్చు చేయక పోతే నిధులు మళ్లిపోతాయి. వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: గడ్డం పెంచుకుంటే ప్రధాని అయిపోరు: సామ్రాట్ చౌదరి
-
Movies News
Anasuya: విజయ్ దేవరకొండతో మాట్లాడటానికి ప్రయత్నించా: అనసూయ
-
Politics News
Siddaramaiah: సీఎం కుర్చీ సంతోషాన్నిచ్చే చోటు కాదు..: సిద్ధరామయ్య
-
General News
TSPSC: Group-1 ప్రిలిమ్స్ రాసే వారికి TSPSC సూచనలు
-
Politics News
JP Nadda: ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం: జేపీ నడ్డా
-
General News
Polavaram: ఎప్పటికైనా పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే: తెదేపా నేతలు