logo

ప్రతిపక్షాలను నమ్మి మోసపోవద్దు

కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ప్రతిపక్షాలను నమ్మి మోసపోవద్దని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 04:55 IST

మంత్రి గంగుల కమలాకర్‌

మాట్లాడుతున్న మంత్రి కమలాకర్‌, వేదికపై వినోద్‌కుమార్‌, రవిశంకర్‌, తదితరులు

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ప్రతిపక్షాలను నమ్మి మోసపోవద్దని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లో భారత్‌ రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ (బీఆర్టీయూ) ఆధ్వర్యంలో జరిగిన కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌, భాజపా పాలకులు ఈ ప్రాంతానికి చేసింది ఏమిలేదన్నారు. వీరు మళ్లీ అధికారంలోకి వస్తే నీరు, నిధులు, బొగ్గును దోచుకెళ్లి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తారన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కార్మికుల భవనం నిర్మాణానికి భూమి కేటాయించామని, మే డే రోజున శంకుస్థాపన చేస్తామని తెలిపారు. షర్మిలది ఏ ఊరో, ఆమె ఇక్కడ ఎందుకు తిరుగుతుందో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. భారాస ప్రభుత్వం కార్మికులకు అండగా నిలిచి సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రవిశంకర్‌, బీఆర్‌టీయూ గౌరవ అధ్యక్షుడు ఎల్‌.రూప్‌ సింగ్‌, జిల్లా అధ్యక్షుడ బొమ్మిడి శ్రీనివాస్‌ రెడ్డి, మేయర్‌ వై.సునీల్‌రావు, భారాస జిల్లా అధ్యక్షుడు జి.వి.రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.


కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కరీంనగర్‌ కలెక్టరేట్‌ : కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంత్రి గంగుల కమలాకర్‌ కొత్తపల్లి, కరీంనగర్‌ అర్బన్‌, రూరల్‌ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కొత్తపల్లి మండలానికి చెందిన 43 మందికి, కరీంనగర్‌ అర్బన్‌కు చెందిన 86 మందికి, కరీంనగర్‌ రూరల్‌ మండలానికి చెందిన 27 మందికి చెక్కులు అందజేశారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, రూరల్‌ ఎంపీపీ లక్ష్మయ్య, ఏఎంసీ ఛైర్మన్‌ రెడ్డవేణి మధు, జడ్పీటీసీ సభ్యులు కరుణ, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు